Friday, 4 November 2016

ఇలా చేస్తే చదివింది బ్రహ్మాండంగా గుర్తుండిపోతుంది

పరీక్షలంటే భయంగా ఉందా? పరీక్ష పేపరు చూడగానే చదివినవన్నీ మరిచిపోతున్నామని బాధ పడుతున్నారా? డోంట్‌ వర్రీ! ఇక మీకు పరీక్ష భయమే అవసరం లేదు. ఎందుకంటే దానికో సరికొత్తచిట్కా వచ్చింది. చక్కగా చదువుకోండి. ఆనక పరుగెత్తండి. ఇక చూస్కోండి నా సామిరంగా! చదివింది బ్రహ్మాండంగా ఒంటబడుతుందంటున్నారు అధ్యయనవేత్తలు. చదువుకున్న తర్వాత వీడియోగేమ్స్‌ ఆడుకోవడం కంటే కూడా రన్నింగ్‌ చేస్తే చదువుకున్నది బాగా గుర్తుంటుందట! దీనికి కారణం మాత్రం ఇంత వరకు తెలియకపోయినాగానీ, ఇదేదో స్ర్టెస్‌ హార్మోన్‌ కార్టి సోల్‌కు సంబంధించిన వ్యవహారంగా కనిపిస్తోందని మాత్రం చెబుతున్నారు. 
 
          పరీక్షల సమయంలో చాలామంది పాఠ్యాంశాలన్నీ చదువుతారుగానీ, మెమొరీ ఉండదు. దీనికి విరుగుడుగా, మనసుకు నచ్చినంతసేపు ఏకాగ్రతగా చదువుకున్న తర్వాత రన్నింగ్‌కి వెళ్ళమంటున్నారు. దీనివల్ల చదివింది మెమొరీలో నిలబడిపోతుందట. అప్పర్‌ ఆస్ర్టేలియాలోని అప్లైడ్‌ సైన్సెస్‌ యూని వర్సిటీ పరిశోధకుల సరికొత్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఐతే చదువుకున్న తర్వాత చేసే వ్యాయామం మితంగా ఉండాలనీ, మరీ ఉదయం ఆరుగంటలకు చేసే భారీ వ్యాయామం తరహాలో ఉండకూడదనీ చెబుతున్నారు.
 
          16 నుండి 29 ఏళ్ళ మధ్యవయసుగల 60 మంది యువతీ యువకులను మూడు బృందా లుగా విభజించి కొందరిని మోడరేట్‌ రన్నింగ్‌కి పంపారు. మరికొందరిని కంప్యూటర్‌గేమ్స్‌ ఆడిం చారు. కొందరిని చదవడానికి ముందు రన్నింగ్‌కి పంపించారు. ఈ ముగ్గురినీ పరీక్షించి వారి మెమొరీ కేలిబర్‌ను అంచనావేశారు. ‘కొంత సమయం చదివి మోడరేట్‌ రన్నింగ్‌ చేసిన వారు’ మెమొరీని కాపాడుకోవడంలో ది బెస్ట్‌గా నిలిచినట్టు గుర్తించారు. వీరికి జర్మన్‌-తుర్కిష్‌ జంట పదాలను ఇచ్చి గుర్తుపెట్టుకోమన్నారు. రన్నింగ్‌ తర్వాత, కంప్యూటర్‌ గేమ్స్‌ తర్వాత వాటిని రిపీట్‌చేసే పరీక్ష పెట్టి ది బెస్ట్‌ను గుర్తించి ఈ నిర్థారణలకు వచ్చారు. ఐతే లెర్నింగ్‌ ఎఫెక్ట్స్‌ను మెరుగుపరిచేందుకు వీడియో గేమ్స్‌ అంతగా దోహదం చేయలేదని అధ్యయనం లీడ్‌ ఆధర్‌ హెరాల్డ్‌ కిండర్‌మాన్‌ వెల్లడించారు.